పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - మధురకాండ : శ్రీకృష్ణుఁడు చాణూరునితో మల్లయుద్ధముఁ జేయుట

డిమల్ల చఱచి భూలయంబు పగుల
బెడిదంబుగా నార్చి పిడికిళ్ళు చాఁచి
వానిమై కదియు ముష్టాముష్టి గనియఁ
జాణూరుఁడును మల్లఱచి యిట్లొరసి
యిరువురు భుజమప్పళించు చప్పుళ్ళు
రనిధి కలఁగె నాశాచక్రమగిలె
నంతకుఁ దెసఁజేరి వనిపరాగ, 
మింతింతఁగొన మేన నిరవారఁ జల్లి
కొనిపదఘాతల కూర్మంబు వగులఁ 
నరు మహాభద్రదంతుల రీతిఁ
జేతికి నొడిసినఁ జేయీక తివిసి
ఘాతసేయంగ దగ్గఱి మేనుదొలఁగి
పొడచిన నది వెలివుచ్చిమైవంచి
యొడిసి తొడలఁదట్టి యార్చి పెల్లురికి
లాగంబుఁ గొనుచు మేనఁ దలఁ గ్రుంకి
బాగుఁ దప్పకఁ దలప్రహతుల నొంచి   - 190
డుముఁ బీడింప విణ్ణనువున మలఁగి
విడిపించుకొని ముష్టి విసరమై పొడిచి
ట్టుచు విడుచుచుఁ రుషఘాతముల
ట్టించి కూర్పరోద్ధతుల నొప్పించ
రవశంబుఁన గొన కాభీరుచోక
రకాండములు లోనుగానీక తొలఁగి
శీసకంబొనరింప శిరమూన్చి పెట్టు
గాసిల్లి కేలడొక్కరమున నొత్తి
రంకెలు వైచు గోరాజుల భంగి
ఝంకించి బింకంబు రిగాఁగఁ బెనఁగి
ముంగలు బలసింగములభంగిఁ బొంగి
నింగిమోవఁగ నార్చి నిడుగుడి పైకుఱికి
మెడయు గాళ్ళును బట్టి మీఁదికి నెత్తి
పుడమి మోవఁగ వ్రేయ భోరున నెగసి
యడపక రాఁగేల నిరియ బిగించి
డినుగ్రమగు ముష్టి క్షంబుఁ బొడువఁ 
డబడ ముష్టిఘాల మోములవసి
దొడిదొడి పన్నెత్తురులు వఱ్ఱుగాఁగ
రియు చాణూరుఁడు ట మల్లయుద్ధ
రుషతఁ దుల్యులై వరంబు సేయ;   - 200